Home / SLIDER / దేశానికే ఆదర్శం కేసీఆర్ పాలన.. మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం..!!

దేశానికే ఆదర్శం కేసీఆర్ పాలన.. మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం..!!

రాజ్యసభసభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు, ఎంపీపీ వొడితల సరోజినీ దేవి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఇవాళ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. గ్రామస్తుల తో మాట్లాడారు. ఎంపీ దంపతులు, ఎమ్మెల్యేకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు.

అనంతరం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిన్న ముల్కనూరును దత్తత తీసుకోవడం హర్షనీయమని అన్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేసారు. చిన్నముల్కనూరు ప్రజలు అదృష్టవంతులని, రూ. 60 కోట్లతో అభివృద్ది పనులు జరగడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షుడని, ఎన్నో సంస్కరణలు తెచ్చారని ప్రశంసించారు. సామాన్యులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఏం కావాలి ? వారు ఏం కోరుకుంటున్నరో సీఎం కు తెలుసునని అన్నారు. సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పాలన చేస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దూరం చేసి పాలనను ప్రజలకు దగ్గర చేస్తున్నారని అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వాటిని ప్రారంభించారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను దేశంలోనే ఏ ప్రభుత్వం చేయలేదని అన్నారు. సీఎం కేసీఅర్ రైతుల పక్షపాతి అని అందుకే ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేసారని, రైతు బంధు పాస్ పుస్తకాలు, పెట్టుబడి ఇచ్చారని అన్నారు. రైతులకు ఉచిత నిరంతర విద్యుత్తు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు.

ఏళ్లకేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా రాని పాస్ పుస్తకాలు అధికారులే గ్రామాలకు వెళ్లి ఇచ్చేలా చేసారని, భూ ప్రక్షాళన చేసారని వివరించారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లొనే రుణ మాఫీ చేసారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో సీఎం పని చేస్తున్నారని, రైతులకోసం తపన పడుతున్నారని అన్నారు. పేద విద్యార్థుల కోసం 500 పైగా గురుకులాలు ప్రారంభించి నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నారని, రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మెరుగు పరచారని అన్నారు. కోట్లాది రూపాయలతో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చెస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. కేసీఆర్ కిట్స్, కల్యాణ లక్ష్మి, పించన్లు వంటి ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. 2019 లో మళ్లీ టీఆరెస్ అధికారం చేపడుతుందని, ప్రజలు టీఆరెస్ పాలనను, సీఎం కేసీఆర్ పాలనను విశ్వసిస్తున్నారని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ మంచి అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. గండిపల్లి, గౌరవెల్లి, శనిగరం, మహాసముద్రం గండి, సింగరాయ ప్రాజెక్టులు పూర్తయితే హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని, లక్షా యాభై వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, రైతులు, ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat