మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక మీరోయిన్ నిహారిక. టాలీవుడ్‌లో పాపులారిటీ దక్కించుకునే క్రమంలో నిహారిక తొలి అడుగుల్లోనే ఉంది. ఆమె హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా ఒక మనస్సు బాక్సాఫీస్‌ను ఆకట్టుకోలేక పోయింది. తరువాత తండ్రి నాగబాబుతో కలిసి నాన్నకూచీ వెబ్‌సిరీస్‌లో కలిసి నటించి ఆకట్టుకుంది. అంతకు ముందు కెరీర్‌లో మొదటగా ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. నిహారిక నటించిన రెండు వెబ్ సిరీస్‌లను డైరెక్ట్ చేసింది ప్రణీత్ బ్రహ్మాండపల్లి.
ప్రణీత్ తాజాగా వెబ్ సిరీస్ నుంచి సినిమా డైరెక్టర్‌గా ప్రమోషన్ కొట్టేశాడు. ఇతను డైరెక్ట్ చేయబోతున్న సినిమాలో నిహారిక హీరోయిన్‌గా నటించనుంది. ఇందులో కొరియో గ్రాఫర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరోగా నటించబోతున్నాడు. ఇదొక ట్రావెల్ బేస్డ్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కబోతోందని ప్రణీత్ చెబుతున్నాడు. ఈ సినిమాలోని కొంత భాగాన్ని హైదరాబాద్‌లోను, మిగతా భాగాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోనూ షూట్ చేయబోతున్నట్టు ఫిల్మ్ వర్గాల టాక్. అయితే, ఇప్పటి వరకు నటించిన చిత్రాలతో సినీ జనాలను ఆకట్టుకోలేక నిహారికకు ప్రణీత్ హిట్ ఇస్తాడేమో చూడాలి.