సోషల్ మీడియా వచ్చిన తరువాత దుష్ప్రచారం ఎక్కువైంది.రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను విభజించిన సంగతి తెలిసిందే.అయితే కొంతమంది కొత్త జిల్లాలను కేంద్రం కుదించినట్లుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే అదంతా పూర్తిగా అబద్దం . ఇలాంటి విషయాలను ఇతరులకు షేర్ చేసి నవ్వులపాలు కాకండి . సమాజంలో అనవసర అపోహలు సృష్టించే వారిపై కేసులు నమోదవుతాయి . తప్పుడు ప్రచారాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి . జిల్లాల ఏర్పాటు అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే . ఇందులో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు అంటూ ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి..
