టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పది కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు .అయితే ఇది బ్లాక్ మెయిలింగ్ కాదు.
see also:ఏపీకి మరో పదేళ్ళు చంద్రబాబే సీఎం ..!
అసలు విషయం ఏమిటి అంటే గతంలో పెను సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లి గారిపై చేసిన వ్యాఖ్యలపై ఏబీఎన్ ,ఇంకో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ నిత్యం వార్తలను ప్రసారం చేసి తమ టీఆర్పీ రేటింగ్ కోసం దిగజారాయి అంటూ ఏకంగా ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లను పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన సంగతి తెల్సిందే.దీనిపై ఆర్కే తమ పరువుకు భంగం కల్గే విధంగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో వ్యవహరించారు.
see also:చంద్రబాబు దమ్మూ, ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీకి రా…వైసీపీ ఎమ్మెల్యే
అదే సోషల్ మీడియా సాక్షిగా తమకు క్షమాపణలు చెప్పాలని కోర్టును ఆశ్రయించాడు.అంతే కాకుండా తమ పరువుకు భంగం కల్గించినందుకు పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు ఆర్కే ..దీనిపై విచారించిన కోర్టు పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై నాలుగో తేదిన హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది ..