కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబం తరువాత బలమైన నాయకుడిగామాజీ మంత్రి డీల్ ఉన్నారు. డిఎల్. రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇటీవల కాలంలో ప్రకటించినట్లు తెలిసిందే. జగన్ కుటుబంతో వైరాలు మరిచి దోస్తీ చేసేందుకు డీల్ రెఢీగా ఉన్నారు. డీల్ తో వ్యక్తిగత కక్షలు లేకపోవటంతో ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా డీల్ ని స్వాగదిస్తున్నారు. త్వరలోనే ఆయన జగన్ తో చేతులు కలపడానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు డిల్ రవీంద్ర వైసీపీలోకి వచ్చేందుకు సిద్దమే అని ప్రచారం సాగింది. ఇందు కు సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని.. ఇద్దరి మధ్య డీల్ ఫిక్స్ అయిందనే చర్చ మొదలైంది అంటూ కథనాలు వచ్చాయి. అయితే తాజాగా రైట్ టైంలో ఎంట్రీ కూడా ఇస్తానన్నారు. ఈ సమయంలో సీనియర్ల అండ ఉంటే మంచిదనే అభిప్రాయా నికి జగన్ వచ్చారు. డిఎల్ రవీంద్రారెడ్డి ఎప్పుడూ ఇంకోక్కరి మాట వినని జగన్ ఈసారి సరే అనగానే..వెంటనే రంగంలోకి దిగుతా అంటున్నారంట.దీంతో వైసీపీలో మరింత ఊపు వచ్చింది.
సీనియర్ రాజకీయ నాయకుడిగా డీఎల్ కి కడప జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది.అందులో ఏపీలో కాంగ్రెస్ పరిస్ధితి కోలుకునే పరిస్దితి లేదు. రాదకీయాల్లో డీల్ చురుగ్గా ఉంటారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే పలువురు నేతలు ప్రత్యామ్నాయంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ వైపు చూడకతప్పడం లేదు. అయితే డీఎల్ కి టీడీపీ బద్ద శత్రువు. అందుకే శత్రువుకి శత్రువు మిత్రుడే కాబట్టి వ్యక్తిగత వైరం కన్నా రాజకీయ శత్రువుకి వ్యతిరేకంగానే డీఎల్ నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా ఆయన వర్గానికి చెందని నాయకులు ఇప్పటికే వైసీపీలో చేరారు. ఆయన అనుచరులు ఒక్కొక్కరుగా చేరడం మొదలుకావడంతో ఇక డీఎల్ చేరిక అనివార్యమన్న వాదన బలపడుతోంది. ఈయన చేరికతో ఆంధ్ర రాజకీయాలతో పాటు వైసీపీకి మళ్లీ కొంత బలం వచ్చినట్టే!