తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డేలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంజినీరింగ్ ప్రతి బ్రాంచ్‌లో టాపర్స్‌కు సర్టిఫికెట్స్ అందజేశారు. కళాశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియం బ్లాక్‌తో పాటు ప్లేస్‌మెంట్, రిక్రూట్‌మెంట్ సెల్‌ను ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా కాలేజీ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..”బాగా కష్టపడి ప్రతిఒక్కరు చదవాలి. నా కాలేజీ రోజుల్లో నేను అమెరికాలో పని చేస్తూ చదువుకున్నా. మా నాన్న నాకు డబ్బు ఇచ్చేవారు కానీ.. నాకు నేను సొంతంగా పని చేస్తూ సంపాదించుకున్నా. ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి ముందుకు వెళ్లాలని కోరుతున్నా. తల్లిదండ్రులు, దేశంపై ప్రేమ ఉండాలి. నిజాయితీ, శ్రమ అభివృద్ధికి షార్ట్ కట్. ఓపికతో పట్టుదలతో సాధించాలి. రేపటి నుంచి తల్లిదండ్రులు మీ బాధ్యతను గుర్తుచేస్తారని తెలిపారు కవిత.మిగతా వాళ్లు సాధారణ పనిచేస్తారు కానీ.. ఇంజినీర్లు మాత్రం కొత్తకొత్తగా ఆలోచిస్తారు. ఈ నాలుగేళ్లు మీరు కష్టపడింది వేరు. ఇప్పటి నుంచి మీరొక బాధ్యత గల ఇంజినీర్లు” అని అన్నారు .ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద,ఎమ్మెల్సీ రాజు ,మైనంపల్లి హనుమంతరావు ఎంపీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Inaugurated Dr. APJ Abdul Kalam auditorium and distributed convocation certificates to young graduate engineers at St Martin's engineering college along with @ChMallareddyMP garu & other public representatives.
I wish every engineer graduate to be an icon of Telangana state. pic.twitter.com/UK8GIZdLLV
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 8, 2018