తెలంగాణ రాష్ట్రంలో 2016లో సంచలనం సృష్టించిన ఎంసెట్ 2 మెడికల్ ఎగ్జామ పేపర్ లీక్ వ్యవహారంలో సోమవారం మరో నిందితుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు . కర్ణాటక రాష్ట్రం దావణగెరెకి చెందిన మెడికల్ స్టూడెంట్ గణేష్ ప్రసాద్ ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు చెప్తున్నారు .
విజయవాడకు చెందిన గణేష్ ప్రసాద్ ముగ్గురు విద్యార్థులకు క్యాంపులో ఎగ్జామ్ రాయించడానికి 35 లక్షల చొప్పున డీల్ చేసుకున్నట్టు సమాచారం.ఒక్కో విద్యార్థి నుంచి గణేష్ ప్రసాద్ 3 లక్షలు కమిషన్ తీసుకున్నాడు . ఇప్పటికే అరెస్టైన ధనుంజయ్ తో ఇతడికి సంబంధాలున్నాయని సీఐడీ పోలీసులు గుర్తించారు . వీరిద్దరూ దావణగెరెలో మెడిస్ చదువుతున్నారు. ధనుంజయ్ సూచనలతోనే గణేష్ ప్రసాద్ విజయవాడ శ్రీచైతన్య కాలేజ్ కు చెందిన ముగ్గురు స్టూడెంట్స్ ను కటక్ తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించాడని తేల్చారు పోలీసులు.
కొద్దిరోజుల క్రితం అరెస్టైన శ్రీ చైతన్య కాలేజ్ డీన్ వాసుబాబుతో గణేష్ లింక్ లపై ఆరా తీస్తున్నారు. స్కాంలో గణేష్ ప్రసాద్ A – 91 ఉన్నాడు. కాగా గత కొన్ని రోజుల క్రితం శ్రీచైతన్య జూనియర్ కాలేజీ చైతన్యపురి బ్రాంచ్ డీన్ వాసుబాబు, శ్రీచైతన్య-నారాయణ కాలేజ్ ఏజెంట్ నారాయణరావుని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..