గనుల శాఖలో మంత్రి కేటీఆర్ ఓ ప్రత్యేకతను చాటకున్నారు. ఈ రోజు సచివాలయంలో గనుల శాఖ ఇప్పటికే అనుసరిస్తున్న అన్ లైన్ సేవలకు అనుబందంగా మరిన్ని సౌకర్యాలు, సేవలను మంత్రి అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు పలు చర్యలు
తీసుకుంటున్నట్లు తెలిపారు. గనుల శాఖలో ఇప్పటికే టెక్నాలజీ వినియోగాన్ని పెద్ద ఎత్తున వాడుకుంటున్నట్లు మంత్రి తెలిపారు
ప్రస్తుతం ఉన్న గనుల శాఖ వెబ్ సైట్లో రాష్ర్టంలోని గనులు, వివిధ ఖనిజాలు లభించే ప్రాంతాలు, గనులు, ఖనిజాల నిల్వలు, ఖనిజాల అధారిత పరిశ్రమలు, వాటి వృద్దికి ఉన్న అవకాశాల వంటి వివరాలను అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. తాజాగా రాష్ర్టంలో నూతనంగా గనుల లీజుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను పూర్తిగా అన్ లైన్ చేస్తున్నట్లు మంత్రి
తెలిపారు. ఇందులో భాగంగా తాజాగా ఏవరైన గనుల లీజులు, అనుమతుల దరఖాస్తులను పూర్తిగా అన్ లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. దీంతోపాటు రెనెవల్ దరఖాస్తులను సైతం గనుల శాఖ అన్ లైన్లోనే స్వీకరిస్తుందన్నారు. దీంతోపాటు మినరల్ డీలర్లు కూడా తమ లెసెన్సుల దరఖాస్తులు సమర్పించడంతోపాటు, అమ్మకాలు, నిల్వ వంటి కార్యకలాపాలు
కొనసాగించేందుకు అవసరం అయిన డిజిటల్ సంతకాలతో కూడిన లైసెన్సులను అందిచనున్నట్లు డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ సుశీల్ కూమార్ మంత్రికి తెలియజేశారు. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్ లైన్లోనే తమ దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవచ్చాన్నారు.
ఈ అన్‌లైన్ విధానాల ద్వారా లైసెన్సుల పునరుద్దరణ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన రాయాల్టీలు సకాలంలో అంది ఖజానాకు అదాయం పెరుగుతుందన్నారు. దీంతోపాటు ఏ అధికారికి నేరుగా కలవాల్సిన అవసరం లేకుండా అనుమతుల ప్రక్ర్రియ పూర్తికావడంతోపాటు పారదర్శకత, వేగం పెరుగుతుందని మంత్రి అన్నారు. త్వరలోనే గనుల శాఖలలో మరింతగా టెక్నాలజీ
వినియోగాన్ని పెంచనున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా లీజుకు ఇచ్చిన విస్తీర్ణాన్ని డిజిటలైజ్ చేసి దాన్ని జియో మ్యాపింగ్ చేయడం, మైనింగ్ సర్వీలియన్స్ సిస్టమ్ల ఏర్పాటు చేయడం, దానితో మైనింగ్ కార్యకలాలపాలను పర్యవేక్షించడం, డ్రోన్ల టెక్నాలజీ వినియోగం లాంటి కార్యక్రమాలను వేంటనే చేపట్టాలని గనుల శాఖాధికారులను మంత్రి అదేశించారు. ఖనిజాలను రవాణా చేసే వాహానాలను రిజిస్టర్ చేసుకుని పర్యవేక్షించడం, జిపియస్, అర్ యప్ ఐడి ట్యాగింగ్ చేయడం వంటి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే గనుల శాఖలో వాడుతున్న టెక్నాలజీ అధారిత అప్లికేషన్ల వినియోగం ద్వారా ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్లో మంచి ర్యాంకు వచ్చిందని, రానున్న కాలంలో ఉపయోగించనున్న టెక్నాలజీ ద్వారా రాష్ర్టంలో గనుల శాఖలో ఈజ్ అప్ డూయింగ్ మరింతగా పెరుగుతుందన్న అశాభావాన్ని వ్యక్తం చేశారు.