రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకు సాగునీరు.. అందించడమే ప్రభుత్వ లక్ష్యమని .. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఈ రోజు మంత్రులు కేటీఆర్, నర్సింహ్మారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రులు మండేపల్లిలో కొత్తగా కట్టిన ITI భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. యువతకు అవసరమైన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు.భవిష్యత్ తలుచుకొని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని తెలిపారు. ఓట్ల కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూనే.. యువతకు అవసరమైన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు.
కృష్ణా, గోదావరి నీళ్లను ఒడిసిపట్టి ప్రతి ఎకరాకు నీరు అందిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని… అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. అందరి అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్న కేటీఆర్. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.
Minister @KTRTRS addressing the gathering after inaugurating the newly-constructed government ITI college building in Rajanna Sircilla Dist. pic.twitter.com/1Dy6wqKhPP
— Min IT, Telangana (@MinIT_Telangana) July 16, 2018