అసెంబ్లీ అంటే పారిపోయేటోళ్లు ప్రతిపక్షాలు ప్రజల పక్షం అవుతారా? అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నాగారాం మండల కేంద్రంలో మూడవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి విపక్ష కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ,జానారెడ్డి,కోమటిరెడ్డిలు ఉత్తర కుమారుని ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. మూడున్నర ఏండ్ల నుండి యాడికోబోయి ఇప్పుడు అభివృద్ధి గురించి అడగడం విడ్డురంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. పదవతరగతి పరీక్షలకు చదవలేక ఇబ్బంది పడే విద్యార్థుల మాదిరిగా ఉంది వారి పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో అసెంబ్లీ పెట్టమని డిమాండ్ చేసే ప్రతిపక్షాలను చూశామని, ఇప్పుడు అసెంబ్లీ ఆనంగానే పారిపోయే విపక్షాలనుచూస్తాన్నామని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో నెల రోజులు అసెంబ్లీ పెట్టాలన్న డిమాండ్ ఉంటే అప్పటి అధికార పక్షం వారం రోజులు పెట్టి చేతులు దులుపుకునేది ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం లో అధికారం లో ఉన్న టి ఆర్ యస్ నెల రోజులు అసెంబ్లీ పెడతామంటే మొదటి రోజే తమకు తాముగా సస్పెండ్ చేపించుకొని పారిపోతున్నారు అని వ్యాఖ్యానించారు. అసలు రాష్ట్రంలో విపక్ష పార్టీకి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద ప్రశ్న అడిగే దమ్మే లేకుండా పోయిందని మంత్రి వ్యాఖ్యానించారు. అందుకే ప్రజల సమస్యలు ఆనంగానే తోక ముడుస్తున్నాయన్నారు.
అటు తుంగతుర్తి ఇటు సూర్యపేట ప్రజల తిరస్కరించిన వారు కూడా అభివృద్ధి గురించి మాట్లాడాడం హస్యాస్పదంగా ఉందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యపేట, తుంగతుర్తిల అభివృద్ధి లెక్కలు గురించి వివరిస్తాం… వినే దమ్ము ఉందా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. “గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఇచ్చిన ఫించన్ ల లెక్కలు చూడండి. అదీ చాలదు అనుకుంటే ప్రభుత్వం తమకు తాము బాధ్యత తీసుకుని చేసిన పెండ్లిళ్ల లెక్కల వివరాలు తెలుసుకోండి. ప్రజలు అస్వస్థత గురయితే ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి అప్పుల పాలు కాకుండా ప్రభుత్వ వైద్యం తో ఎంత మందిని కాపాడామో ప్రజల దగ్గరకు వెళ్లి అడగండి.మీ ప్రభుత్వ హాయంలో ఎప్పుడైనా రైతులకు నిండా అరుగంటల విద్యుత్ సరఫరా చేసిన దాఖలాలు ఉన్నాయా ? లాఠీ దెబ్బలు తినకుండా విత్తనాలు అందించిన చరిత్ర ఉందా? చెప్పులు అరిగేలా తిరిగితేనే గదా రైతులకు యూరియా బస్తాలు అందింది. అదే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతులకు 17000 కోట్ల రుణమాఫీనీ అమలు పరిచాం. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ను పటిష్టం చేసేందుకు కులవృత్తులను ప్రోత్సహిస్తున్నాం. తొలకరి పడగానే రైతు పెట్టుబడి కోసం అప్పుల పాలు కాకుండ ఉండేందుకే రైతుబందు పధకం తీసుకొచ్చినం“ అఈని మంత్రి స్పష్టం చేశారు.