వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. అయితే జగన్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ క్రమంలో జగన్ మహిళలు దృష్టిలో ఉంచుకునే పధకాలను ప్రకటిస్తున్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేయూతనిస్తే ఆయన తనయుడు జగన్ ప్రకటనతో డ్వాక్రా సంఘాల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే రిసోర్స్ పర్సన్స్ ఆర్‌పీ లకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అలాగే పిల్లలను బడికి పంపితే ఆ పిల్లాడి తల్లి అకౌంట్లలో తాను డబ్బులు వేస్తానని జగన్ ప్రకటించారు. ముఖ్యంగా మహిళలను వేధించే సమస్య భర్త తాగుడుకు బానిసలు కావడమే..
అయితే జగన్ సీఎం అయ్యాక దశలవారీగా మద్య నిషేదం విధిస్తానని ప్రకటించారు. ఇటువంటి హామీల పట్ల మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే పేదవారికి ఇళ్లు కట్టించి ఆ ఇంటిని మహిళపేరుమీదే రిజిస్ట్రేషన్ చేసి అవసరమైతే రుణాలు కూడా ఇస్తామని జగన్ ప్రకటించారు. తాము జగన్ వెంటే ఉంటామని, జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం అని మహిళలు చెప్తున్నారు. జగన్ ఎక్కడకు వెళ్లినా మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. నాలుగేళ్లుగా అన్నీ కష్టాలేనని వాపోతున్నారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కచ్చితంగా జగన్ హామీ ఇస్తే నిలబెట్టుకుంటారని నమ్ముతున్న ప్రజలు మహిళలు జగన్ కు నీరాజనం పలుకుతున్నారు. మద్యపాన నిషేదం, అమ్మఒడి పధకాలతో జగన్ మహిళల మనస్సుల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.