స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ సాయి సేవ సమితి, గీతం కల్చర్ & సోషల్ ఆర్గనైజేషన్.మరియ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు సెంట్రల్ ఎంపీలోయ్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఎనమిది తండా పెద్దవురా మండలం ,నల్గొండ జిల్లాలోని రామవత్ భోజ్య నాయక్ గారి స్వగృహం నందు బంజారా జాతి గాంధీ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భోజ్య నాయక్ ఘాటు మాట్లాడుతూ తన పూర్వ అనుభవాలను నెమరివేసుకున్నారు.అప్పటి నాగార్జున సాగర్ డాం కట్టడానికి తనవంతుగా తన తండాలోని ప్రజలను అందులో పాలిపగస్తులు చేశారు..
తాను రూపాయి 25 పైసలు నుండి కూలీగా మట్టిని ఎత్తను అని అలాంటి జ్ఞాపకాలను నెమరు చేసుకొన్నారు. అలాంటి ప్రధాని నెహ్రు గాంధీ ,ఇందిరా గాంధీ తనను ఓయ్ భోజ్యా నాయక్ అని పిలిచారు.. అపుడు తాను 175 మంది కూలీలకు తాను మూతమేస్త్రి గా పనిచేశాను అని తన జ్ఞాపకాలను పంచుకున్నారు. టి ఆర్ స్ నాయకుడు గడ్డంపలి రవీందర్ రెడ్డి.భోజ్య నాయక్ తో మాటముచ్చట కల్పిన్నారు.. ఇలాంటి స్వాతంత్ర్య సమరయోధులు కలవడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో శ్రీ సాయి సేవ సమితి చైర్మన్ గారు మాట్లాడుతూ మన స్వాతంత్ర్య యోధులు ఆ రోజు పడిన కష్టాల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న ఫలితాలు… ఈ మహానియుడిని కలసి తనను సత్కరించటం నా జన్మ సుకృతం అని అన్నారు..ఇలాంటి స్వాతంత్ర సమరయోధులు నుండి నేటి యువత ఎంతో నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.. అవినీతి రూపుమాపలి అంటే అది కేవలం యువత వల్లే అవుతుంది. మనదేశాని అవినీతిరహిత మరియు పచ్చని దేశంగా రాబోయే తరాలు చూడాలి అని కొండకళ్ల నాగేందర్ రెడ్డి నేషనల్ హుమన్స్ రైట్స్ & అంటి కరపక్షన్ ఫోర్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నారు..
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కన్వీనర్ లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ..మన బంజారా జాతి గాంధీ భోజ్యా నాయక్ గారిని మన బంజారా బిడ్డ స్వాతంత్ర్య సమరయోధుడు ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని స్వతంత్ర దినోత్సవం రోజున కలవడం తన అనుభూతులను మాతో పంచుకోవడం. చాలా ఉపయోగకరమైన సమయంగా భావిస్తున్నాను. అలనాడు మన నాయకుల త్యాగ ఫలితమే నేడు జాతి అనుభవిస్తున్న ఫలం…ఈ కార్యక్రమంలో తిలక్ గారు,రాజియా బేగం గారు, అన్వర్ గారు,శ్రీకాంత్, మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్న తండా ప్రజలు.