భారీ వర్షాలు.. వరదలతో అన్ని కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఒకరితరువాత ఒకరు దాతలు ముందుకొస్తున్నారు.ఈ క్రమంలోనే కేరళ వరద బాధితులకు బాలీవుడ్ నటి సన్నీ లియోని అండగా నిలిచారు.1200 కేజీల బియ్యం, పప్పులను సాయం గా అందజేస్తునట్లు తెలిపింది.ఈ మేరకు ఆమె తన భర్త డానియెల్ వెబర్, స్నేహితులతో కలిసి బియ్యం బస్తాల వద్ద దిగిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
‘కొంతమంది కేరళీయులకు నేను, డేనియల్ కలిసి ఆహారం అందించగలుగుతున్నాం. 1200 కిలోల బియ్యం, పప్పులనున అందించాం. ఇప్పుడు కేరళ వాసులకు కావాల్సిందే ఇదే నాకు తెలుసు. ఇంకా సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. జుహులో విరాళాలు సేకరించిన ప్రతీక్, సిద్ధార్థ్ కపూర్, సువేద్ లోహియా చాలా గొప్పవారు’ అని సన్నీ పోస్ట్ చేసింది.కాగా గతకొన్ని రోజులుగా సన్నీ లియోని ఏకంగా ఐదు కోట్లు ఇచ్చిందంటూ వార్తలొచ్చాయి. అవన్నీ అబద్ధాలని తేలిపోయింది.