ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనకు షాక్‌కు గురిచేసిందని తెలిపారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో హరికృష్ణ జగన్ లు ఓ కార్యక్రమంలో కలిసారు.
