నందమూరి హరికృష్ణ మృతితో తెలుగు పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపన్ని తెలియజేస్తున్నారు. అక్కినేని నాగార్జున కూడా కొన్ని వారాల క్రితమే ఆయన నాతో నిన్ను చూసి చాలా రోజులయింది.. కలవాలి తమ్ముడు అన్నారు. ఇప్పుడు ఆయన లేరు. మిస్ యూ అన్నా.. అంటూ ట్విటర్‌లో తన సంతాపాన్ని తెలియజేశారు. సీతారామరాజు చిత్రంలోని ఫొటోను పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో హరికృష్ణ, నాగర్జున అన్నదమ్ములుగా నటించారు. అప్పటినుంచి అన్నా, తమ్ముడు అని పిలుచుకుంటారు. అలాగే కాజల్ కూడా ఈవార్త వినడం చాలా బాధ కలిగించింది. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్, కళ్యాణ్‌తో పాటు కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. అలాగే అల్లరి నరేష్, సాయి ధర్మ్ తేజ్, కోన వెంకట్, సుధీర్ బాబు, మంచు లక్ష్మి, దేవిశ్రీప్రసాద్, మంచు మనోజ్, హరీష్ శంకర్ లు హరికృష్ణ మృతిపట్ల సంతాపం తెలిపి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసారు.
