తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో నేపధ్యంలో రాజకీయం వేడేక్కింది. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కౌంటర్స్ ఇవ్వడం మొదలైంది. టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
’అమెరికాలో ఉన్నప్పుడు నా పనులు నేనే సొంతంగా చేసుకున్నాను. మీ పప్పులా కాకుండా సొంతంగా సంపాదించుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నీలాగా ప్రజల సొమ్ముదోచుకుని కారులో తగలబెట్టలేదు.’ అని ఉత్తమ్‌కు కేటీఆర్ చురకలింటించారు. 2014 ఎన్నికల్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన కారులో రూ.2 కోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటే అది బ్రమగానే ఉండిపోతుందని కేటీఆర్ వివరించారు.