తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు తాజాగా దేశ రాజకీయాల్లోనే వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన తర్వాతఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా కావాలని కోరుకుంటున్నారని టీటీడీపీ నేతలతో చంద్రబాబు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా కాంగ్రెస్ అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవానికి పోటీగానే టీడీపీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీని చంద్రబాబు కాంగ్రెస్ కు దాసోహం చేస్తున్నారు.
ఆరెండు పార్టీలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయ్. దాదాపు 35 ఏళ్ల పాటు కత్తులు నూరుకున్ను పార్టీలు తొలిసారి కలిసి పోటీ చేయబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితిని ఓడించడమే లక్ష్యంగా తమ సిద్ధాంతాలను పక్కన పెట్టడం చూసి అందరూ నివ్వెరపోతున్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నినాదంతో…కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలుగుదేశం భూస్థాపితం అయ్యింది. అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు నిర్వహించిన పొలిట్ బ్యూరో మీటింగ్ లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబు బావమరిది హరికృష్ణ ఉండి ఉంటే అనే ఆలోచనే టీడీపీ శ్రేణులను కలచివేస్తోంది.
హరి అన్న ఉండుంటే పొలిట్ బ్యూరోలో కచ్చితంగా కాంగ్రెస్ తో కలయికను విబేధించేవారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు ఆయన సిద్ధాంతాలను దగ్గరుండి నిశితంగా పరిశీలించిన హరికృష్ణ ఇప్పుడు తన తండ్రి ఆశయాలకు, ఆలోచనలకు వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయం తీసుకుని ఉంటే బహిరంగానే వ్యతిరేకిస్తారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు అసలైన తెలుగుదేశం కార్యకర్తలు.