ఏపీ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు బెయిల్ కూడా లభించని విధంగా నోటీసులు జారీ చేసింది.ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. అయితే ఈమేరకు శుక్రవారం నాడు నాందేడ్ ఎస్పీ కతార్ మీడియాతో మాట్లాడుతూ…బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయమై ఎనిమిదేళ్ల నుండి ఎవరిని కూడ విచారణ చేయలేదనే విషయమై ఆయన స్పందించారు. ఐదేళ్లకు ముందే చార్జీషీట్ ను దాఖలు చేసి ఆ ప్రతులను నిందితులుగా ఉన్న వారికి పంపించినట్టు ఆయన చెప్పారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అదుపులో ఉన్నా పట్టించుకోకపోవడం, వంటి వివిధ కారణలతో చంద్రబాబుపై కేసులు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు. ఆనాటి వీడియోలు, ఫోటోలను సాక్ష్యాలను ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు.చంద్రబాబుని ఈ నెల 21 వ తేదీలోపుగా హాజరుపర్చాలని ధర్మాబాద్ కోర్టు నుండి తమకు ఆదేశాలు వచ్చాయన్నారు.బాబు సహా ఇతర నిందితులు కోర్టుకు హాజరు కాకుంటే న్యాయసలహా తీసుకొని అరెస్ట్ చేసి తరలిస్తామన్నారు ఎస్పీ కతార్ తెలియజేసారు.