ఏపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర శనివారం 262 వ రోజుకు చేరింది. విశాఖ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయన విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలోని చనగదిలి క్యూ-1 ఆసుపత్రి ప్రాంతం నుండి అశేష జన వాహిని మధ్య పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ రోజు మొత్తం మూడు నియోజక వర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుంది.
విశాఖ తూర్పుతో పాటు పెందుర్తి, భీమిలీ లోని చాలా ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్ర లో పార్టీ కార్యకర్తల తో పాటు, పెద్ద సంఖ్యలో మహిళలు , యువకులు పాల్గొన్నారు. జగన్ సీఎం కావాలని వారంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు పాలన పై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి జగన్ సీఎం ఐతే అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు.