కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి రేవంత్‌రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
సోదాలు జరుగుతున్న చోట్ల కుటుంబసభ్యుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించారు. అయితే ప్రస్తుతం ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఉన్నారు. ఆయన నివాసంలో ప్రస్తుతం పనివారు తప్ప కుటుంబసభ్యులెవరూ లేరు. కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ జూబ్లీహిల్స్ పోలీసులు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.