ఏపీలో జరిగే ఎన్నికలపై మరో సర్వే బయటకు వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. టీవీ-సీఎ ఎన్ ఎక్స్ సంస్థ చేసిన జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… టీడీపీకి ఎన్ని లోక్ సభ సీట్లు వస్తాయి అన్న విషయం చూస్తే… ఆశ్చర్యం వేయక మానదు. మొత్తం 25 చోట్ల టీడీపీ పోటీ చేసినా… ఆ పార్టీకి కేవలం నాలుగంటే నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే దక్కుతాయట. అదే సమయంలో గడచిన ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగడంతో పాటు అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయలేనంటూ కుండబద్దలు కొట్టిన ఏపీ ప్రతి పక్ష నేత వైఎస్ జగన్ పార్టీ వైసీపీకి ఈ సారి ఏకంగా 19 లోక్ సభ సీట్లు గెలబోతుందని సర్వే వెల్లడించింది. 2014 ఎన్నికల్లో ఏపీలో 8 సీట్లు తెలంగాణలో ఓ సీటు సాధించిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క ఏపీలోనే ఏకంగా 19 సీట్లు దక్కనున్నాయని టీవీ-సీఎ ఎన్ ఎక్స్ సర్వే తేల్చేసింది. ఇక మిగిలిన రెండు ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ ఎగురవేసుకుపోతుందట. జరగబోయో ఎన్నికల్లో ఏ ఒక్కరూ ఊహించనంత మేర సత్తా చాటుతామని బీరాలు పలుకుతున్న టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ సార్టీ జనసేనకు అసలు లోక్ సభ సీట్లలో కౌంటే దక్కదట. మొత్తంగా ఈ సర్వే చూస్తే… ఏపీలో జగన్ సునామీ మొదలవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.
