దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో భాగమైన ‘పాదయాత్ర’ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ సినిమా ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వైఎస్సాఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా చాలాబాగుందని, వైఎస్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎస్-2 మల్టీప్లెక్స్ లో యాత్ర సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నేతల్లో వైఎస్ ఒక లెజెండ్ అని, ఎన్నో పధకాలు ప్రవేశపెట్టి కోట్ల మందికి ఆరాధ్యుడయ్యారని కొనియాడారు. ఈ సినిమా రూపొంచిందిన చిత్రయూనిట్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర సినిమా విడుదల సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు బాణాసంచా కాల్చారు.
