జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్ తగిలింది.జనసేనలో సామాజికన్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఏలూరు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మత్తే బాబి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ‘నాకు కులం, మతం లేదని పవన్ కల్యాణ్ చెబుతుంటారు. కానీ కమిటీల్లో సమన్యాయం చేయకుండా ఒకే సామాజికవర్గానికి పదవులను కట్టబెట్టారు. ఏలూరు పార్లమెంట్ ప్రధాన కమిటీల్లో ఆరు ప్రధాన పదవులను ఒకే సామాజికవర్గానికి కేటాయించారు. ఇదెక్కడి సామాజిక న్యాయం? అని బాబి దుయ్యబట్టారు.
