లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్రాల విడుదలను నిలిపివేయాలని గత కొన్ని రోజుల క్రితం దాఖలైన పిటీషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. వచ్చేనెల 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో రసవత్తరంగా జరగనున్న ఎన్నికల నేపధ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదలను ఆపాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలోనే ఆ సినిమాలపై దాఖలైన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. ఆ చిత్రాల విడుదలలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. దేశంలోని ప్రతీ వ్యక్తికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, కాబట్టి ఈ రెండు సినిమాల విడుదలను ఆపటం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు తీర్పు సందర్భంగా వర్మ పలు ట్వీట్లు చేశారు.
He is also promoting #LakshmiNTR pic.twitter.com/7e31Rvemp6
— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2019
లక్ష్మిస్ ఎన్టీఆర్ విడుదలను ఆపటం కుదరదు..భావ స్వేచ్ఛ విషయంలో మేము కలగజేసుకోలేమన్న న్యాయస్థానం ..లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు అని తెలిపిన అడ్వకేట్ జనరల్ ..దీంతో సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చిన న్యాయ స్థానం* #LakshmisNTR
— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2019
లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపాలని వేసిన పిటిషన్ కొట్టివేసిన టీఎస్ హైకోర్టు.
లక్ష్మిస్ ఎన్టీఆర్ విడుదలను ఆపాలని ’..ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషన్ దాఖలు ..పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. #LakshmiNTR— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2019