డబ్బులు, పదవి ఎప్పటికీ శాశ్వతం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి సినీ నటుడు మోహన్ బాబు అన్నారు.ఇవాళ అయన తిరుపతిలో విద్యార‍్థులతో కలిసి అయన ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..
మనిషే శాశ్వతం కాదు…ఇంకా పదవి కూడా కాదనేది గుర్తు పెట్టుకో. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుపై ఒకసారి చెప్పాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటాం. కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తాం. చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించేవాడు అయితే వెంటనే వాళ్ల ఫీజులు చెల్లించాలి ” అని మోహన్ బాబు కోరారు.
