బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు.. కోలీవుడ్ నుండు మాలీవుడ్ వరకు సమాజంలో జరిగిన జరుగుతున్న వాస్తవ నేపథ్యాల ఆధారంగా తాజాగా సినిమాలు వస్తున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా సరిగా పన్నెండ్ల కిందట అంటే 2007-2013 సంవత్సరాల మధ్య జరిగిన మొత్తం యాబై ఏడు బాంబ్ బ్లాస్ట్‌ల సంఘటనలను ఆధారంగా తీసుకుని రైడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్.బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం యొక్క టీజర్‌ను ఈ రోజు మంగళవారం విడుదల చేశారు.
కరుడగట్టిన ఉగ్రవాది బిన్ లాడెన్స్ స్పూర్తితో కరుడుగట్టిన ఒక ఉగ్రవాది చేసిన దారుణ ఘటనలను ఆధారంగా ఈ మూవీ తీస్తున్నారు.అంతేకాకుండా ఇండియాస్ ఒసామా అనే పిలవబడే ఆ వ్యక్తిని మనదేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులు బుల్లెట్ కూడా వాడకుండా ఎలా పట్టుకున్నారు అన్న నేపథ్యంలో కూడా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రభాత్ పాత్రను అర్జున్ కపూర్ పోషించారు. మే 24న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో రాజేష్ శర్మ, ప్రశాంత్ అలెగ్జాండర్, గౌరవ్ మిశ్రా, ఆసిఫ్ ఖాన్, సాన్‌టిలాల్ ముఖర్జీ, బజ్‌రంగబలీ సింగ్, ప్రవీణ్ సింగ్ సిసోడియా తదితరులు చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. అమిత్ త్రివేది ఈ మూవీకి సంగీత దర్శకత్వం వహిస్తోన్నారు. మీరు ఒక లుక్ వేయండి.