తన అమ్మమ్మ భూమి ని కబ్జా చెసారు అని 19 సంవత్సరాల యువకుడు హరిష్ రావు ని కలవడానికి ఇటీవల సైకిల్ యాత్ర చేపట్టిన బిల్ల తరుణ్ అనే యువకుడు హైదరాబాద్ లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారిని కల్సి తన సమస్యను చెప్పుకున్నాడు.. మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం మా అమ్మమ్మ చామంతుల దుర్గమ్మ అనే భూమిని వెంకటాపురం కి చెందిన కొంతమంది తమ భూమిని కబ్జా చేయడం తో ఎన్నోసార్లు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా ప్రయోజనం ఏమీ లేకపోవడంతో మిమ్మల్ని కలవాలని గత వారం రోజుల నుండి వెంకటాపురం నుండి సైకిల్ యాత్ర చేపట్టాను అని హరిశ్ రావు గారికి వివరించారు.. నేను మీ అభిమానిని అన్న.. నన్ను ఆదుకోవాలని చెప్పారు..వెంటనే హరీష్ రావు గారు స్పందించి.. అక్కడి సిఐ మరియు ఎమ్మార్వో లకు ఫోన్ లో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారం చేయాలని..వారికి తగు న్యాయం చేయాలి అని చెప్పారు…సైకిల్ యాత్ర చేపట్టిన తరుణ్ అభిమానాన్ని చాటుకున్న హరిశ్ రావు గారు సమస్య పరిష్కారానికి భరిసానిచ్చారు..₹10వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసారు.. తనని కల్వటానికి వచ్చిన తరుణ్ కి తన్నీరు బాసట గా నిలిచి వారి కుటంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు.. ఈ సందర్భంగా తరుణ్ మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారికి తన కుటుంబ పక్షనా కృతజ్ఞతలు తెలిపారు.