సిద్దిపేట నియోజకవర్గం నారాయణ రావు పెట్ మండలం గుర్రాల గొంది గ్రామంలో జరిగిన పెద్దమ్మ ఉత్సవాల్లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి అనుగ్రహంతో అందరం బాగుండాలని ప్రార్థించారు.. గుర్రాల గొంది గ్రామం అంటే అభివృద్ధి లో ఆదర్శమని.. మరో సారి ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా చేసుకొని ఆదర్శంగా నిలిచారన్నారు.. మన ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొద్దీ రోజుల్లోనే గోదావరి జలాలు రాబోతున్నాయన్నారు.. మొగులుకు మొహం పెట్టి చూసే పనిలేదు…కాలం అయిన కాకా పోయిన కాళేశ్వరం నీళ్లొస్తున్నాయ్.. గుర్రాల గొంది పెద్దరాయిని చెరువు నింపుకుందాం అన్నారు.. మొహాన్ని నెలకు పెట్టుడే…దుక్కి దున్నుడే..రెండు పంటలు పండించాల్సిందేనని అన్నారు…మలేషియా దేశం నుండి డి ఎక్స్ ఎన్ కంపనీ పెట్టె పరిశ్రమ లో ప్రయోగాత్మకంగా గుర్రాల గొందినే ఎంపిక చేశామన్నారు.. ఈ గ్రామం నుండే సిరిసిల్ల… సిద్దిపేట నుండే జాతీయ రహదారి ఏర్పాటు కాబోతోందన్నారు..
– మీ వంతు అయింది… మిగిలింది నా వంతె…
అభివృద్ధి లో గ్రామము ఆదర్శంగా నిలిచింది.. ఎన్నికల్లో ఊరంతా నన్ను ఏకగ్రీవంగా చేసి మీ అభిమానాన్ని చూపించారు.. ఇగ మీ వంతు పని అయింది.. మిగిలింది నా వంతు అని.. 5ఏళ్లలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి మీ ఋణం తీర్చుకుంటా అని అని గుర్రాల గొంది గ్రామ ప్రజలతో ఆత్మీయంగా చెప్పారు.