ఏపీ ప్రజలకు ఇది హెచ్చరికలాంటి వార్త.రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ఆర్టీజీఎస్ తాజాగా మరో హెచ్చరికను జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన వడగాల్పులు కూడా బలంగా వీస్తాయి. కాబట్టి వృద్ధులు,చిన్నపిల్లలు ఎక్కువగా ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలోని ఉభయ గోదావరి ,కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆర్టీజీఎస్ తెలిపింది..
