Home / SLIDER / గల్ఫ్ భాదితునికి కేటీఆర్ చేయూత..!!

గల్ఫ్ భాదితునికి కేటీఆర్ చేయూత..!!

స‌హాయం అవ‌స‌రం ఉన్నవారు ఒక్క ట్వీట్ చేస్తే చాలు స్పందించే టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఇక దేశం కాని దేశంలో తీవ్ర‌మైన ఆప‌ద‌లో ఉన్న‌వారు స‌హాయం కోరితే..ఇంకెలా స్పందిస్తారో చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా ఓ అభాగ్యుడు త‌న ఆవేద‌న‌ను పంచుకుంటూ, విడుద‌ల చేసిన వీడియో ఓ నెటిజ‌న్ షేర్ చేయ‌డంతో దానిపై వేగంగా స్పందించి ఆయ‌న‌కు విముక్తి క‌ల్పించేందుకు యుద్ధ ప్రాతిప‌దిక‌న రంగంలోకి దిగారు.

వివరాల్లోకి వెళితే…కరీంనగర్ జిల్లా తుమ్మాపురం మండలానికి చెందిన వీర‌య్య బ‌తుకుదెరువు కోసం అబుదాబి వెళ్లారు.  అయితే, అక్క‌డాయ‌న‌కు ప్ర‌త్య‌క్ష న‌ర‌కం క‌నిపించింది. దీంతో త‌న ఆవేద‌నను వీడియో రూపంలో వ్య‌క్తం చేశాడు “మాది పేద కుటుంబం. అబుదాబికి వచ్చి రెండేళ్లు అవుతుంది. మా యజమానికి వంద ఒంటెలు ఉన్నాయి. వాటిని నేనొక్కడినే చూసుకోవాలి. ఒక ఒంటె చనిపోవడంతో మా యజమాని నన్ను పొట్టుపొట్టుగా చావగొట్టిండు. దవడ పండ్లు ఊడి మాట్లాడవస్తలేదు సార్. నేనుండే ప్రాంతంలో కరెంటు ఉండదు. సద్ది తెచ్చిఇచ్చే వాళ్లు ఉండరు. పనంతా చేసి మా తిండి మేమే కట్టెల పొయ్యి మీద వండుకోవాలి. మా యజమాని జీతం ఇవ్వక, తిండి పెట్టక హింసిస్తున్నాడు. భార్య ఆస్పత్రిలో ఉందని చెప్పినా చూడనికి సైతం పంపిస్తలేడు. మా అమ్మ చచ్చిపోతే కూడా పంపిస్తలేడు సార్. దయచేసి మమ్మల్ని ఇండియా తీసుకుపోండి సార్ “అని ప్రాధేయపడ్డాడు.

బాధితుడు వీర‌య్య వీడియోను ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చేరేలా చేశారు. దీనికి త‌క్ష‌ణ‌మే కేటీఆర్ స్పందించారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, యూఏఈలో భారత రాయబారి ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా కోరారు. అతన్ని ఎలాగైనా విడిపించి భారత్‌కు వచ్చేలా చూడాల్సిందిగా కోరారు. కేటీఆర్ ట్వీట్‌కు యూఏఈ భారత రాయబారి నవదీప్ సూరి స్పందించారు. రియాద్‌లోని ఎంబసీ సదరు వ్యక్తి అంశాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. ప్రతిగా కేటీఆర్.. నవదీప్ సూరికి కృతజ్ఞతలు తెలిపారు. త్వ‌ర‌లో వీర‌య్య‌కు మవిముక్తి క‌ల‌గ‌నుంది. కేటీఆర్ కృషి ఫ‌లితంగా, ఆయ‌న కుటుంబంలో సంతోషం వెల్లివిరియ‌నుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat