TV9సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడున్నారనేది ప్రస్తుతం అందరి ముందున్న ప్రశ్న? రవిప్రకాష్ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. రెండ్రోజులుగా ఈయన అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఫిర్యాదు చేశారు. 2019, మే 09వ తేదీన ఉదయమే ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు రవి ప్రకాష్, అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. TV9 కార్యాలయంతోపాటు రవి ప్రకాష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. గతంలో టీవీ9 91 శాతం వాటాను అలంద మీడియా కొనుగోలు చేసింది. 9శాతం వాటా మాత్రమే రవి ప్రకాష్ వద్ద ఉంది అయితే యాజమాన్యం మారినప్పటి నుంచి టీవీ9 తన నియంత్రణలోనే ఉండాలంటూ కొత్త యాజమాన్యాన్ని రవిప్రకాష్ ఇబ్బంది పెడుతున్నారట..
అలాగే యాజమాన్యం మారిన తర్వాత నలుగురు కొత్త డైరెక్టర్లను బోర్డులో చేర్చడానికి తీర్మానం చేశారట.. దీనిపై కేంద్ర సమాచార శాఖ అనుమతి కూడా ఇచ్చింది. అయినా కొత్త డైరెక్టర్ల నియామానికి రవి ప్రకాష్ అడ్డు తగిలడంతో అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు గుర్తించి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. దీన్ని ముందే పసిగట్టిన రవి ప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కంప్లైంట్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు సోదాలు చేపట్టారు. అలాగే సంస్థలోని తన అనుచర ఉద్యోగుల ద్వారా టీవీ9 ఆఫీసు నుంచి ఫైళ్లు, ల్యాప్ ట్యాప్, హార్డ్ డిస్క్ మాయం చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే ఓవ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అసలు టీవీ9 ఆఫీసునుంచి ఫైళ్లు, ల్యాప్ ట్యాప్ లు రవిప్రకాష్ ఎందుకు రహస్యంగా తీసుకెళ్లారనేదే అసలు విచారణలో తేలాల్సి ఉంది.