టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఏపీలో వైసీపీ ప్రభంజనంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె”ఏపీలో వైసీపీ గెలుపుపై ఫేస్‌బుక్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను తాను దేవసేనతో పోల్చుకున్న ఆమె తన పగ తీరిందంటూ సంబరాల చేసుకుంటున్నారు.
నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి వన్ అండ్ ఓన్లీ జగన్’ అంటూ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ సర్కార్‌కు లైన్ క్లియర్ అయింది.
టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోనుంది. అటు ప్రశ్నిస్తాను అంటూ ఊగిపోయిన నటుడు, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ పార్టీ సోదిలో కూడా లేకుండా తోక ముడిచింది. ఈ నేపథ్యంలోనే తన పగతీరిందంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం గమనార‍్హం.