రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ సిఐ శ్రీనివాస్ చౌదరి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన రెండు బాధితు కుటుంబాలకు రూ.10 వేలు అందించి.. ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచాడు. బద్దెనపల్లి గ్రామానికి చెందిన నెల రోజుల క్రితం తల్లిదండ్రులను కొల్పోయిన చిన్నారి ఆశ్వీత(13)కు సిఐ శ్రీనివాస్ చౌదరి సోమవారం చిన్నారి ఇంటికి వెళ్లి రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. ఇదే గ్రామంలో నేత కార్మిక కుటుంబానికి చెందిన కొండ లక్ష్మీ (40) క్యాన్సర్ బారిన పడి మంచాన పడింది. వైద్యానికి కూడా డబ్బులు లేని దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఈ కుటుంబానికి రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు. ఇంటర్లోనే చదువు మానేసిన లక్ష్మీ కూతురు రమ్యను చదవిస్తానని, ఖర్చు భరిస్తానని సిఐ శ్రీనివాస్ చౌదరి హమీ ఇచ్చారు. లక్ష్మీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో.. పడుకన్న చోటే.. మల మూత్రలు పోయే పరిస్థితి ఉండటంతో.. బద్దెనపల్లిలో అద్దె ఇంటి వారు ఇల్లు ఖాళీ చేయించడంతో.. తంగళ్లపల్లి గ్రామంలో తలదాచుకుంటున్నారు. భర్త రాజేశం సాంచెలు నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. నిలువ నీడ కూడ లేకపోవడంతో..వీరికున్న 60 గజాల స్థలంలో ఓ రేకుల ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు దాతల సాయం తీసుకుంటామని ..తన వంతు సాయం కూడా అందిస్తానని సిఐ శ్రీనివాస్ చౌదరి పేర్కొన్నారు.