తెలంగాణ రైతన్నలకు సర్కార్ శుభవార్త చెప్పింది. సోమవారం రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.రైతు పెట్టుబడి సాయం కోసం రూ.6900 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనుంది. ఈ క్రమంలోనే ఈనెల 7, 8 తేదీల్లో ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నిక తర్వాత రైతుబంధు సాయం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
