విలువలతో కూడిన రాజకీయం చేయాలంటే…దమ్ముండాలి. మాట తప్పని…మడమ తిప్పని వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం కారణంగానే…విలువలతో కూడిన రాజకీయం వల్లే…ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్….అటు నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో మరే పార్టీకి రాని రికార్డు స్థాయి మెజార్టీని, మరే నాయకుడు సాధించని విజయాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. ఆంధ్రుల మద్దతుతో సీఎం పీఠం అధిరోహించారు.
See Also : టీడీపీ షాకింగ్ న్యూస్.. జగన్ సీఎం కావాలని జూ.ఎన్టీఆర్ కోరుకున్నారా..?
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం విప్లవాత్మకం, సంచలనమే. ప్రతిపక్ష నేతగా ప్రజలతో మమేకం అయిన సమయంలో వారికి ఇచ్చిన హామీ మేరకు జగన్ వాటిని తూచా తప్పకుండా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలోని సీఎం ఛాంబర్‌తో పాటు అందరూ మంత్రుల ఛాంబర్‌లలో మ్యానిఫెస్టో తప్పనిసరిగా పెట్టాలని ఆదేశించారు. మ్యానిఫెస్టో అంటే తమకు పవిత్ర గ్రంథంతో సమానం అని సీఎం జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందుకే నిత్యం తమ బాధ్యతను గుర్తు చేసేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు చెబుతున్నారు.
కాగా, జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలుగుదేశం నేతల మొహాల్లో రక్తపు చుక్క లేకుండా చేసిందంటున్నారు. టీడీపీ హయాంలో అధికారం దక్కించుకునేందుకు ఎన్నో మాటలు చెప్పిన నేతలు…అనంతరం వాటిని తుంగలో తొక్కేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, మేనిఫెస్టోను సైతం తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్లో ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిన ఘనత టీడీపీ నాయకులది. దానికి భిన్నంగా మంత్రుల చాంబర్లలోనే మేనిఫెస్టో ఉంచడం..జగన్ జవాబు దారీతనానికి నిదర్శనమంటున్నారు.