Home / SLIDER / కేసీఆర్‌ను మించిన దార్శనికులు లేరు.. మంత్రి జగదీష్ రెడ్డి

కేసీఆర్‌ను మించిన దార్శనికులు లేరు.. మంత్రి జగదీష్ రెడ్డి

విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం సూర్యపేట జిల్లాలోని చివ్వేంలలో బీసీ గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశంలో సీఎం కేసీఆర్‌ను మించిన దార్శనికులు మరెవ్వరూ లేరని అన్నారు. ఉద్యమ సమయంలోనే విద్యా విధానంలో తీసుకురావాల్సిన సంస్కరణలుపై సీఎం కేసీఆర్ అధ్యయనం చేశారు. నేడు కేజీ టూ పీజీ విద్యావిధానంలో అంద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పిల్లలు నేడు ఉన్నతమైన విద్యను అభ్యసిస్తు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నరు. బాలిక విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్,జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ పాల్గొన్నారు.