ఇవాళ తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులు, జడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సభ్యత్వం స్వీకరించి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన 11 ప్రత్యేక కౌంటర్లలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు మంత్రులు ఈటలరాజేందర్, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, తలసాని, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు.
