మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం ముండ్రాయి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..”ఈ ఇండ్లు చూస్తుంటే హైదరాబాద్ లో ఉన్నా అపార్ట్ మెంట్ భవనాలమాదిరి కనిపిస్తున్నాయి. ఏనుకటి రోజుల్లో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత ఉండేది. రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు కట్టిస్తున్నాం,కళలో కూడా ఊహించని ఇండ్లు కట్టినం. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చే40 వేలు బేస్మెంట్ కు కూడా సరిపోయేది కాదు, అప్పులు మాత్రమే మిగిలేవి. నేడు ప్రతి అమ్మ సంతోషం తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్క ప్రజాప్రతినిదికి ఇంతకన్నా ఏమి కావాలి. త్వరలోనే మిలిగిలిన అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేస్తా. గ్రామంలోని యువత ఆదర్శంగా పనిచేస్తున్నారు. యువత గ్రామంలోని ప్రతి ఒక్కరూ వందశాతం అక్షరాస్యత ఉండేలా, క్లిన్ గ్రామంగా మారిస్తే గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తా. రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామం అభివృద్ధి దిశలో నడుస్తుంది. ప్రభుత్వం నిజమైన పేదలకు ఇండ్లు ఇస్తుంది. ప్రతి ఒక్కరు తమ ఇంటిని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ” అని అన్నారు.
