హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం జోరుగా కొనసాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ నాంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో విజయ్‌నగర్ కాలనీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో నచ్చి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని వివరించారు. దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలను తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. హైదరాబాద్ మహనగరానికి నీటికొరత లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం నుంచి నీటిని తరలిస్తున్నారని తెలిపారు.
