తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో గులాబీ ముఖ్య నేతలు బుధవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశం సందర్బంగా గత నెల ఇరవై ఏడో తారీఖు నుండి జరుగుతున్న పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాల గురించి.. క్షేత్ర స్థాయిలో పార్టీ పనితీరుపై.. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన పలు వ్యుహ్యాలపై చర్చించనున్నట్లు సమాచారం. అయితే పురపాలక ఎన్నికలపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.
