Home / SLIDER / యువనేత కేటీఆర్ బాటలో గులాబీ శ్రేణులు,అభిమానులు

యువనేత కేటీఆర్ బాటలో గులాబీ శ్రేణులు,అభిమానులు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున తన పుట్టిన రోజు జరుపుకోనున్న సంగతి విదితమే. అయితే ప్రతియేటా పుట్టినరోజు వేడుకలను కొందరు ప్రముఖులు చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. మరికొందరు బర్త్‌డేలకు వెచ్చించే డబ్బును ఆపదలో ఉన్నవారికి అందిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు.

ఇందులో రెండోకోవకు చెందిన వ్యక్తి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా పూల బొకేలు, పత్రికా ప్రకటనలు కాకుండా అవసరమున్న పేదలకు లేదా సమాజంలోని వివిధవర్గాలకు సాధ్యమైనంత మేరకు సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన పుట్టినరోజు (జూలై 24)ను పురస్కరించుకొని కేటీఆర్ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్ పేరుతో ట్విట్టర్ వేదికగా వినూత్నమైన ప్రచారాన్ని గతంలోనే ప్రారంభించారు.

దీనికి అన్నివర్గాల నుంచి విస్తృతమైన ఆదరణ లభిస్తున్నది. ఈ చాలెంజ్‌లో భాగంగా తమకు తోచినంత సహాయాన్ని చుట్టుపక్కలవారికి అందించడంతోపాటు మీరు కూడా ఇలా చేయండి అంటూ తమకు తెలిసిన వారిని నామినేట్ చేస్తున్నారు. ఇలా నామినేట్ చేసినవారు సైతం ఎంతోకొంత ఇతరులకు సహకారం అందించేందుకు ముందుకొస్తున్నారు. మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ఆలోచనకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.