Home / SLIDER / రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలి..కేటీఆర్

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలి..కేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బూత్ కమిటీల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇంకా సిరిసిల్లకు చేయాల్సింది మిగిలి ఉంది. దసరా నాటికి కలెక్టరేట్ పూర్తి అయితే ఆర్ డీ ఓ కార్యాలయ ప్రాంగణంలో ఇన్ డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడుతం. మానేరు కరకట్టపై హైద్రాబాద్ ట్యాంక్ బ్యాండ్ మాదిరి తీర్చిదిద్దుతాం.1360 మండే పల్లి,పెద్దూరు వద్ద 400 డబుల్ బెడ్ రూం ల ఇళ్లు నిర్మించాం. అవి సరిపోవు ఇంకా నిర్మాణం జరగాలని ఆయన అన్నారు.అలాగే నేతన్నల కోసం 100ల కోట్ల ఆర్డర్లు ఇచ్చినామని.. నేతన్నల కోసం 1200 కోట్ల బడ్జెట్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక లాభం జరిగిందా నష్టం జరిగిందో నేతన్నలను అడగండి అని కేటీఆర్‌ అన్నారు. మిడ్ మానేరు రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైనా.. వారికి పరిహారం ఇచ్చింది మాత్రం కేసీఆరే అని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బులు తీసుకున్న వారిని తీసుకు వచ్చి ధర్నా చేశారు. అదేవిధంగా వేములవాడకు నిధులు ఇచ్చింది కేసీఆర్. కొంత మంది దేవుడి పైసలు తిన్నారు. పెరిగిన ఆదాయం పేదలకు పంచుతున్నాం.12 వేల కోట్లా పింఛన్‌లో కేంద్రం ఇచ్చేది 200 కోట్లు మాత్రమే అన్నారు. ఇక ప్రత్యర్థి ఎవరన్నది అనవసరం.. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలు మనమే గెలవాలి. టీఆర్ఎస్ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి వారితో కలిసి పోండి వారి సమస్యలు పరిష్కారం చేయండి. బూత్ కమిటీ వారు వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలు నా వద్దకు తీసుకు వస్తే పరిష్కరిస్తామన్నారు.. విస్తృతంగా ప్రచారం చేస్తే అంత లాభం ఉంటుంది. అన్ని వార్డులకు టీంలు వేస్తున్నము. ఆగస్ట్ 15 నాటికి సిరిసిల్లలోని అన్ని ఇండ్లు తిరిగి సమస్యలేవో నాకు చెప్తే సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం చేసింది చేయబోయేది అన్ని ప్రజలకు చెప్పండి. వార్డుల్లో ఏం పని చేసింది ప్రగతి నివేదిక తయారు చేసి అందిస్తాం వాటిని ఇంటింటికి తీసుకెళ్లండి. కోర్ట్ తీర్పు చెప్తాది. తీర్పు వచ్చే లోపు ఓ దఫా ప్రచారం పూర్తి చేయండి.అని కేటీఆర్‌ సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat