తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈగ, బాహుబలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కన్నడ నటుడు సుదీప్. ప్రస్తుతం ఈ నటుడు ఎస్.కృష్ణ దర్శకత్వంలో పహిల్వాన్ అనే చిత్రం చేస్తున్నాడు.
స్వప్న కృష్ణ పహిల్వాన్ నేతృత్వంలో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం పలు కసరత్తులు సైతం చేశారు సుదీప్.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలిసారిగా సుదీప్ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్ దుహాన్‌సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.