తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగ సందర్భంగా ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా అందించే చీరెల తయారీ వేగవంతమైంది. బతుకమ్మ చీరెలను పది డిజైన్లలో, ఒక్కో డిజైన్ మొత్తం పది రంగుల్లో తయారుచేస్తున్నారు. దీంతో వంద వెరైటీల్లో చీరెలు తయారు కానున్నాయి. వచ్చే నెల (సెప్టెంబర్) 28 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. చీరెల పంపిణీని వచ్చే నెల15 కల్లా పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ క్రమంలోనే చీరెల తయారీతో సిరిసిల్లలో కార్మికులకు ఆరునెలలు చేతినిండా పనిదొరుకుతున్నది. కాగా.. తెల్లరేషన్ కార్డు ఉండి 18 ఏండ్ల నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరెను సీఎం కేసీఆర్ కానుకగా అందజేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మంది అర్హులు ఉంటారనే అంచనాతో చీరెల తయారీ ప్రారంభించారు.
#సిరిసిల్ల పట్టణంలో #బతుకమ్మ చీరల తయారీని క్షేత్రస్థాయిలో పరిశీలించి, కార్మికులతో ఇంటరాక్ట్ అయిన రాష్ట్రస్థాయి #పాత్రికేయుల బృందం. @IPRTelangana @KTRTRS @TelanganaCMO #presstour #media #fieldvisit #batukamma pic.twitter.com/TOUpqWkJNL
— CollRajannaSircilla (@Collector_RSL) August 30, 2019