ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు మొబైల్ యూజర్లను ఆకర్శించుకోవడానికి ప్రతి రోజు ఏదోక కొత్త సాంకేతకతో పలు మొబైళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన లెనోవో కె10 నోట్ పేరిట ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ రోజు గురువారం భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 4\6జీబీ ర్యామ్ ,64\128జీబీ ఇంటర్నల్ మెమరీను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్లో 6.39ఇంచుల డిస్ ప్లే ,ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 710ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 9.0పై,16,8,5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,16మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ,యూఎస్బీ టైప్ సి 4050 ఎంహెచ్ బ్యాటరీ,ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంది. అయితే దీని ధర రూ.15వేల 999లు ఉంది. ఈ నెల పదహారు తారీఖు నుంచి మార్కెట్లో అందుబాటులో ఉండబోతుంది.
