ఆకుపచ్చ తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం అనే మహాయజ్ఞాన్ని చేపట్టారు. ఈ హరితహారానికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను ప్రముఖ యాంకర్ అనసూయ స్వీకరించారు. ఈ మేరకుఈ రోజు కేబీఆర్ పార్క్ ముందు జీహెచ్ఎంసీ ఏరియాలో మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత తన కొడుకుతో పాటు.. యాంకర్ సుమా కనకాల, నటులు అడివి శేషు, ప్రియదర్శి, డైరెక్టర్ వంశీ పైడిపల్లిని తలా మూడు మొక్కలు నాటాల్సిందిగా ఆమె కోరారు. ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ ను మొదలుపెట్టి… కీసర అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ ను అనసూయ అభినందించారు. గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని యాంకర్ అనసూయ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు కాదంబరి కిరణ్,అడిషనల్ కమిషనర్ కృష్ణ, గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
I've accepted #HaraHaiTohBharaHai #GreenIndiaChallenge
from @bonthurammohan Sir & thanks to @MPsantoshtrs Sir
Planted 3 saplings
I appeal to @ItsSumaKanakala @AdiviSesh @directorvamshi @priyadarshi_i & my elder son #ShauryaBharadwaj
to plant 3 ?& continue the chain ?? pic.twitter.com/192vOR3ccl— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 14, 2019