తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ,మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఈ రోజు సోమ వారం హైదరాబాద్ మహానగరంలోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి, విప్ వినయ్ భాస్కర్ ,ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ,ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ” మంత్రిగా నాకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
నేను గిరిజనుల సంక్షేమం కోసం.. మహిళా శిశు సంక్షేమం కోసం. ఆయా వర్గాల అభ్యున్నతికై పనిచేస్తానని హామీస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ రెండు శాఖల మంత్రిగా నా బాధ్యతలు పూర్తిగా నిర్వహించి.. నాపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని ఆమె అన్నారు.