తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక రంగంలో మరో ముందడుగు వేసింది. పునరుత్పాదక రంగంలో అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంతో ఈ రోజు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్ ఫిల్ మర్ఫీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్ కే జోషి ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. న్యూజె ర్సీ రాష్ట్రంతో జరిగిన ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆయా రంగాల్లో మేలుకలుగుతుందని తెలిపారు. అమెరికాలో తాను కొంత కలం పాటు న్యూజెర్సీలో ఉన్నానని గవర్నక్‌కు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఈ ఒప్పందం ద్వారా రెండు రాష్ట్రాల్లో జియో థర్మల్, థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ విభాగాల్లో మరింత పురోగతి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే సోలార్ ద్వారా 20.41 గిగావాట్లు, విండ్ ఎనర్జీ ద్వారా 4.2 గిగావాట్ల శక్తితో కలిపి మొత్తంగా 4 వేల 36 మెగావాట్ల పునరుత్తాదక శక్తిని సాధించిందన్నారు.
Happy to announce that the states of Telangana and New Jersey have signed a ‘Sister State Partnership Agreement’ in Hyderabad today. The agreement was signed by Chief Secretary SK Joshi, and New Jersey State Governor @GovMurphy#NJIndiaMission pic.twitter.com/osPVFvVVaT
— KTR (@KTRTRS) September 18, 2019