తెలంగాణ రాష్ట్రానికి చెందిన మున్సిపల్ సవరణ బిల్లు-2019ను అసెంబ్లీలో సభ్యులు ఆమోదించారు. రాష్ట్ర మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సవరణ మున్సిపల్ చట్టం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి రామారావు ఆ బిల్లు గురించి సంబంధించిన విషయాలను వెల్లడించారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో ,పట్టణాల్లో పాలనకై ఆరు వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. అవన్నీ చాలా పాతవి. ఆయా చట్టాల్లో ఉన్న లోపాల వలన కార్యాచరణ మంచిగా లేదు.
దీనివలన అనుకున్న అభివృద్ధి జరగడం లేదు. తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం-1965,1994 మరియు టౌన్ మరియు కంట్రీ ప్లానింగ్ చట్టం-1920,అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం-1975,జీహెచ్ఎంసీ యాక్ట్ -1955,హెచ్ఎండీఏ యాక్ట్-2008 ఈ ఆరు చట్టాలను ఆయా సమయాల్లో అప్పుడు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రూపొందించారని”తెలిపారు.