తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చాలా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56.4లక్షల మంది బతుకమ్మ చీరలను అందుకున్నారు. అయితే బతుకమ్మ చీరల పంపిణీ దసరా పండుగకు ముందు రోజు వరకు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మంత్రుల దగ్గర నుండి కార్యకర్తల వరకు పలువురు ప్రజాప్రతినిధులు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చీరలు అందుకున్న మహిళలు తమకు ముందే దసరా పండుగోచ్చిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు పెద్దన్న మాదిరిగా చీరలను పంపిణీ చేస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్నారు.
